కీర్తనలు

48. ఉదయగీతి

రాగం: ఆనందభైరవి|తాళం: త్రిపుట|ఛాయ: ఎందుకు మరచితివి|రచయిత: బన్యన్ జోసఫ్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక దినమున్ దయతో నిచ్చెన దేవా||
1.  పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి బ్రోవుమయ్య||
2.  కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో నీదినము మన నియ్యుమో దేవా||
3.  పితా సుతా శుద్ధాత్మలనెడి దేవా ప్రీతితో గావుమయ్యా నీతిమార్గములందు నిరతము మముగాచి ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో దేవా||