47. ప్రాతస్తవము

రాగం: పంతువరాళి • తాళం: అట • ఛాయ: ఇదిగో గోర్రెల కాపరి
పల్లవి:లేచి స్తుతింపఁ బూనుఁడి లోకేశ్వరుని లేచి స్తుతింపఁ బూనుఁడి లేచి స్తుతించెదము చూచుచు మనలను బ్రోచి ప్రేమతోఁ గరము జాచి కాపాడు విభుని ||లేచి||
1. రాత్రి జాముల యందున రంజిలఁదన నేత్రము తెరచినందున మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపుసఁబ విత్ర గీతము పాడుచు ||లేచి||
2. నిదురఁభోయిన వేళను నిర్మలమైన హృదయము మనకు నియ్యను ముదముతో నిదురఁబొంది యుదయాన లేచితిమి సదయుఁడైన క్రీస్తు పదముల దరిఁజేర ||లేచి||
3. నిగమ వేద్యుఁడు మనలనుఁ దనలోన నీ పగలు కాపాడఁబూనెను దిగులు బొందక పనులు తెగువతోఁ జరుపుకొనుచు వగపుతో లేచి మ్రొక్కి మిగుల శుద్ధాత్మనడిగి ||లేచి||
4. నేటి పాఠములయందు నిర్భయముగ దాటివెలసి యుందు సూటిగ నీదు ఱెక్కల చాటుగను నిలుపు మనుచు నీటుగా నెల్లవార నిత్యము ప్రేమనేల ||లేచి||