← కీర్తనలు

49. సాయంతనారాధన

రాగం: నాధనామక్రియ|తాళం: ఆది|రచయిత: మిక్కిలి సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో ప్రభువా నిను శర ణొందితి ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా ||వినవే||
1.  నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా కొసఁగి చేయు దీప్తవంతునిగ నన్ను ||వినవే||
2.  నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా ||వినవే||
3.  ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది నీ పద సంగతమై యున్నది రేవగలు ||వినవే||
4.  పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుఁగ నీ పాద సరోజము నా కొసఁగుము నాపై నీ కృపఁ జెలఁగ ||వినవే||
5.  నీ కొరకై నా మనము దృఢంబౌఁ గాక యేసు ప్రభువా నాకుఁ బిశాచముచే భ్రమ జన్మము గాకుండఁగ నేలు ||వినవే||