27. దైవస్తుతి

రాగం: బిలహరి • తాళం: త్రిపుట • రచయిత: వీర్పుల మోషే
పల్లవి:కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కలుగు నున్నతమైన ఘన స్థలములందున నిలకు సమాధానం నరుల కాయన దయ ||కలుగును||
1. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము ||కలుగును||
2. మహిమపర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిఁ దలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము ||కలుగును||
3. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొఱ్ఱె పిల్ల మమ్మును కనికరించుము చల్లఁగ ||కలుగును||
4. లోకపాపములు మోయుచుఁ బోవు యేసు రక్షకా వాసిగ జనకుని కుడివైపునఁ గూర్చుండి యేసూ మా ప్రార్థన నాలించి కనికరించు ||కలుగును||
5. పరిశుద్ధుఁడవు ప్రభుఁడవు నీవో ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతోఁ తండ్రి యైన దేవునియందుఁబరిపూర్ణ మహిమతోఁ బ్రబలుచున్నామవామేన్ ||కలుగును||