కీర్తనలు

26. 95-వ దావీదు కీర్తన

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: సమూయేలు పాక్యవాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే||
1.  రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి||
2.  మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యముగల రాజు భూమ్య గాధపులోయలును భూధర శిఖరము లాయనవే ||రండి||
3.  సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిఁజేసెన్ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి||
4.  ఆ ప్రభు సన్నిధి మోఁకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును ||రండి||
5.  తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుఁగాక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్ ||రండి||