← కీర్తనలు

28. దేవుని మహిమ

రాగం: ఆనందభైరవి|తాళం: ఝంపె|రచయిత: బేతాళ జాన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి సమాధానానుగ్రహము గల్గున్ర్పభో ||మహిమ||
1.  నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ||
2.  ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ||
3.  వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి వినుతింతుము సత్ర్వభో ||మహిమ||
4.  జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల జనకుని కుమారుడ ప్రభో ||మహిమ||
5.  ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మా బీద మొరలాలించుము ప్రభో ||మహిమ||
6.  తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావు కృపజూపుమి సత్ర్పభో ||మహిమ||
7.  పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ||మహిమ||
8.  పరమ జనకుని మహిమన్ పరిశుద్దాత్మైక్యంబై సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ||మహిమ||