కీర్తనలు

10. దేవుని ప్రేమ

రాగం: జంఝూటి|తాళం: ఆది

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే ||ఎంత||
1.  ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని నింత యంతయని వచించు మనుజుఁ డెవ్వఁడు ||ఎంత||
2.  మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ దానిఁ జనువుఁగ జగమందుఁ బొగడ మాట లందవే ||ఎంత||
3.  దేవదూతలైన దానిఁ బాడలేరట యింక దేవుఁడే తన సుతు నొసంగి ఇంత యది యనెన్ ||ఎంత||
4.  ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే ప్రభు జెంతఁజేరి సంత తంబు ప్రీతిఁ జేసెదన్ ||ఎంత||