← కీర్తనలు

11. దేవుని వైపు చూచుట

రాగం: కమాసు|తాళం: త్రిపుట|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీవైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాఁచుచుఁ గరములు చక్కఁగా నీవైపు ||చూచు||
1.  మేమరులమై యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు ప్రియ తనయ నంపించి క్షేమమార్గము మాకుఁ బ్రేమను జూపితివి ||చూచు||
2.  నిను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణుఁ జొచ్చువారలకు ఇనుఁడవు కేడెంబు నీ జగతిలో నగుచుఁ గనుపరచుచుందువు ఘన మైన నీ కృపఁ ||చూచు||
3.  నీ భయము మాయెదలను నిలుపుము నీదు ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము వైభవ మొందుచు నే భయము లేకుండ నీ భువిని గొన్నాళ్ళు ||చూచు||
4.  దయఁజూచి మము నెప్పుడు మంచివి యన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయుమని కోరఁ దయజూపి మన్నించు దయగల మా తండ్రి ||చూచు||