కీర్తనలు

9. స్తుతి గీతము

రాగం: శంకరాభరణము|తాళం: ఏక|రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ప్రతి దినము నిను ప్రచురపరచెద ప్రభుడ నావిభుడా ||ప్ర||
1.  పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతి కా నందమొసగిన మహిమతేజుడవు ||ప్ర||
2.  చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో స్వాంతమున కడు శాంతిగూర్చితి వెంత కరుణదియో ||ప్ర||
3.  నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడ నను గారవించిన నీతిరాజితడే ||ప్ర||
4.  జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరా యిక జాలమేలనురా ||ప్ర||
5.  నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది సుగుణశోభిత సమ్మదిని నిమ్మా ||ప్ర||