పల్లవి:
సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను నిర్వహించును దాస భారము నిత్య మెద రాజిల్లను ||సర్వ||
1. ముదముతో నిర్మాణ్కుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేఁడరే ||సర్వ||
2. వేదపారాయణము సేయుచు విశ్వ మంత జయింపరే సాదరముగా దేవునిఁక మీ స్వాంతమునఁ బూజింపరే ||సర్వ||
3. ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుగా నుతిఁజేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే ||సర్వ||
4. చావు పుట్టుక లేనివాఁడుగ సంతతము జీవించును ఈవు లిచ్చుచుఁ దన్ను వేఁడు మహేష్టులను రక్షించును ||సర్వ||
5. దాసులై దేవునికి నెదలో దర్పమును బోఁగాల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము నే మరక మైఁదాల్పరే ||సర్వ||
