పల్లవి:
సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో కన్నతండ్రి కావుమా కలుషము నెడబాపుమా||
1. నీతిసూర్య తేజమా జ్యోతిరత్న రాజమా పాతకజన రక్షకా పతితపావన నామకా|
2. మానవ సంరక్షకా దీన నిచయ పోషకా దేవమానవ నందనా దివ్య సుగుణ మందనా||
3. ప్రేమ తత్వభోధకా క్షేమదాత వీవెగా కామిత ఫలదాయక స్వామి యేసు నాయక||
4. పాపచింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో నీ పవిత్ర నామమున్ నిరతము స్మరియించెదన్||
