కీర్తనలు

6. యెహూవా స్తుతి

రాగం: యమన్|తాళం: ఆది

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటం గూడరే యేకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||
1.  మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభు న్మే మెచ్చుగా మది నెంతుము ||భీకరుండౌ||
2.  ఏరితోడు లేక మము సర్వేశ్వరుఁడు సృష్టించెను ధారుణిం దా నొక్కఁడే మా దైవమని పూజింతుము ||భీకరుండౌ||
3.  పుట్టగిట్టంజేయఁదానై నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్థులారా ప్రస్తుతింపరె భక్తిని ||భీకరుండౌ||
4.  మేటి సంగీతంబులుపై మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను ||భీకరుండౌ||
5.  మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను దిక్కులేని గొఱ్ఱె లట్లుఁ దిరుగఁజేర్పన్ మందను ||భీకరుండౌ||
పద వివరణలు
1. సింహాసనము. 2. ఎవరిని. 3. చంపను. 4. మోత. 5. చావు.