← కీర్తనలు

5. దైవ స్తుతి

రాగం: నవరోజు|తాళం: త్రిపుట|రచయిత: పసుపులేటి దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో నర్పించుఁడి మీయాత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుఁడి ||నీతి||
1.  చదలఁ బుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కఁగా సదమలంబగు దైవనామము సర్వదా నుతిఁజేయను ||నీతి||
2.  సర్వశక్తుని కార్యముల కీ సర్వరాష్ట్ర్రము లన్నియు గర్వములు విడి తలలు వంచుచు నుర్విలో నుతిఁజేయను ||నీతి||
3.  గీత తాండవ వాద్యములచేఁ బ్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుఁడి ||నీతి||
4.  పరమదూతలు నరులు పుడమిని మొరలుబెట్టుచు దేవుని పరము నందున్నట్టి యేసుని పాదములు సేవింతురు ||నీతి||
5.  ఇలను భక్తుల గూడుకొనియా బలము గల్గిన దేవుని వెలయు స్తుతి వే నోళ్లతోడను విసుగు జెందక జేయుడి ||నీతి||
6.  ఆత్మ నీవిఁక మేలుకొని శుద్ధాత్మఁ యేసునిఁ దండ్రిని త్రిత్వమగునా యేక దేవుని హర్షమున సేవింపవే ||నీతి||
పద వివరణలు
7. ఆకాశము. 8. పరిశుద్ధము. 9. నాట్యము.