కీర్తనలు

4. దేవుని యనూనత్వములు

రాగం: కేదారగౌళ|తాళం: ఆది|రచయిత: పురుషోత్తము చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన యెహోవా స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర ||దేవా||
1.  సార కారుణ్యపారా వారా సర్వజ్ఞ నిర్వి కారా యేసు నామావతారా దీన జనోపకారా ఘోరమైన సంసారటవిఁ బడి దారిఁ గనని ననుఁ జేరఁబిలిచితివి ||దేవా||
2.  అక్షీణ విభవానంద మోక్ష రాజ్య మహిమాధ్యక్ష సంతత సుజన రక్షా కపట దుర్మనుజ శిక్షా పక్ష విపక్ష విలక్షణ రహిత కటాక్షము నాదెస దీక్షను నిలుపవె ||దేవా||
3.  సుందరాశ్చర్య గుణ బృందా బంధుర నిత్యానందా సాధు సజ్జన వంద్యా ఖందిత కలుష బృందా మంద మతిని నా దెందము కడుఁదెలి వొందఁ జేసి నీ యందు నిలుపఁ గదె ||దేవా|
4.  నీవు నన్ను సృష్టించి నావు నా గురురాడ్దేవుఁ డవు క్రీస్తు యేసుని చావు వలన నన్మనిపి నావు పావన జనక సుతాత్మలతోడను గేవల మొక్కఁడ వై వెలిఁగెడి ప్రభు ||దేవా||
5.  ప్రేమ స్వరూప నిత్య క్షేమ పతిత పావన నామ దాస లోకాబ్ధి సోమ సర్వేశ పరమ ధామ నేమ మెఱుంగని నీచుఁడ నధముఁడ నోమహాత్మ దయతో మన్నింపవె ||దేవా||
పద వివరణలు
1. మితిలేని దివ్య మహిమగలవాడా. 2. నన్ను రక్షించుము. 3. చలించనివాటితోను చలించువాటితోను గూడుకొనిన. 4. సమస్తలోకమును. 5. రక్షింపవలెనను పరిశుద్ధభావము నిరంతరము కలవాడా. 6. సారమైన కరుణకు సముద్రుడా. 7. తరగని భాగ్యమును ఆనందమును గలవాడా. 8. శత్రుమిత్రభావములనెడు విరుద్ధ గుణములు లేనివాడు. 1. గుణానమూహము కలవాడా. 2. దట్టమైన నిత్యానందముకలవాడా. 3. నమస్కరింపబడదగినవాడా. 4. ఎంతమాత్రము పాపము లేనివాడా. 5. పాపులను పవిత్రపరచువాడను పేరు కలవాడా. 6. దాససమూహమును సముద్రమునకు చంద్రుని వంటివాడా.