కీర్తనలు

3. యేసు సహాయమునకై ప్రార్ధన

రాగం: మారువ|తాళం: ఆది|ఛాయ: తనువు నాదిదిగో|రచయిత: గొల్లపల్లి సతానియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా మోసములన్నిటి మునగఁద్రోతునని బాసలు జేసిన ప్రభుఁడవు నీవెగా ||యేసు||
1.  రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ పిశచిని త్రోయుమి దూరము బాయక భక్తుల చేయి విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా ||యేసు||
2.  హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును సదయుఁడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ ||యేసు|
3.  కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను ఏ పాపములును ఏలకుండగ నీ ప్రాపునఁబెంచుము మాపాలకుఁడవో ||యేసు||
4.  మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోఁగొట్టగ మానము మహిమలు మనుజుల కియ్యను భానుఁడ రాజుగ బ్రతికిలేచితివి ||యేసు||
5.  చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే వరముల నిడితివి ధరలో నరులకు పరముఁడ నీ దయ మరువశక్యమా ||యేసు||