పల్లవి:
గానముఁ జేయుఁడు సుకీర్తనను యెహోవాను గూరిచి క్రొత్తఁ గాను రక్తిగను ||గానము||
1. తన్నామము నుతించి యతని రక్షఁ జెన్నుఁగ సారెఁ బ్రసిద్ధముఁ జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను జాటండి ||గానము||
2. ఘనతయు మహత్మ్యమును దద్ఘనని యెదుటనుండు ఘనబలమును వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము||
3. పరిశుద్ధాలంకారముతో నా పరమాత్మారాధన పరులై యుండండి ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతిఁ గొనుచు నుండండి ||గానము||
4. పరిపాలించుచున్నాఁడనుచు తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ స్థిరముగఁ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానము||
5. ఏమనిన నా మహాత్ముండు వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు ||గానము||
6. జనులారా యా యెహోవాకు మహిమను బలమును సమర్పణము జేయండి వినయముతోఁ గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున వసియింపండి ||గానము||
