← కీర్తనలు

763. వివాహం - దేవుని సంకల్పం

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎక్కడెక్కడో పుట్టి - ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
1.  ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు పెళ్ళినాటినుండి తల్లిదండ్రుల వదలి భార్యభర్తలు హత్తుకొనుటేమిటో ॥ఇది దేవుని॥
2.  గతకాలకీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్ళినాటినుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో ॥ఇది దేవుని॥
3.  ఫలియించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధిపొందెదరు పెళ్ళినాటినుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో ॥ఇది దేవుని||