← కీర్తనలు

719. యేసుని భజియింపవే మనసా

రచయిత: ఆచార్య అర్. అర్. కె. మూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసుని భజియింపవే మనసా భాసమాన తేజుని - ఘన రక్షకుని ||యేసుని ||
1.  ధిమికిట ధిమికిట దివ్య మృదంగా తకిట తకిట యని తాళము వేయుచు ||యేసుని ||
2.  బిలహరి సారమతి కాంభోజి - బృందాన సారంగా కదంబము- రాగస్వర ||యేసుని || రంజితమై - ఆ ...ఆ దేవుని రాజ్యము కరుణామృతమెలుకగా ||యేసుని ||
3.  రాగం తానం పల్లవి రస మాధురి సుమ వల్లరి - యేసుపద పద్మములపై కొలపోసి తలపోసి తరియించుము ||యేసుని ||