← కీర్తనలు

711. పరలోకానందము

రచయిత: ఆచార్య అర్. అర్. కె. మూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది (2) కాలము స్థలము లేనిది (2) సుందర పురము – నందనవనము (2) ||బ్యూలా||
1.  స్పటిక నది తీరము నాది అన్నిటిలో ఘనం అనాది (2) అనుపల్లవి: శ్రుతి లేని రాగములు (2) అలరెడు పురము యేసుని వరము (2) ||బ్యూలా||
2.  జీవ వృక్ష ఫల సాయము నాది దేవుని మహిమ స్పర్శ వేది (2) మరణం బాధే లేనిది (2) అమరుల పురము మంగళకరము (2) ||బ్యూలా||