← కీర్తనలు

707. దేవా! స్త్రీల మైత్రిని వర్దిల్ల జేయుము!

ఛాయ: నేను నీ వాడను|రచయిత: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నేను నీ వాడను దేవ నిక్కంబుగా దేవ వేడుచు నుంటిమి – స్త్రీల మైత్రిని దేవ వర్దిల్ల జేయుమీ
1.  స్త్రీ మైత్రిలో జేరు స్త్రీల నందరి కృపతో చాల దీవెనలిచ్చి చక్కగా నడిపించు
2.  ప్రార్థనలయందు – ప్రభువుసేవయందు సార్ధకముగ నీకై సాక్ష్యమిచ్చుట యందు ॥దేవా॥
3.  మాటయందును మరియు – మేటి కార్యములందు తేట క్రైస్తవ బ్రతుకు -చాటి చూపుట కొరకు ॥దేవ॥
4.  పరిశుద్ధ వివాహ పవిత్రతను ఎరిగి మరణాంత మగుదనుక స్థిరముగ జీవించ ||దేవా॥
5.  పిల్లలందరిన్ ప్రభువు భయమునందున బెంచ తల్లులందరి కెపుడు – తగు సాయమియ్యను ||దేవా॥