696. సిలువ శ్రమలు!

పల్లవి:సిలువ మోసినావా – శ్రమలకోర్చినావా – యేసునాధా సత్యజీవం స్వర్గమునకు దారి

అనుపల్లవి:
ఆహా – నాదోషములే- మహావేదన బెట్టెనా – మోక్ష రాజా సర్వసత్య సంపూర్ణ ప్రదీప
1. రాతియంతటను – రోదనముచే గెత్సెమనే వనమందు – గడిపి గొప్ప వేదనముతో – ప్రార్థింపగ తండ్రిని- ప్రాణనాధా రక్తధారల్- నాకై రాల్చినావా
||సిలువ॥
2. కత్తుల్ గుదియలతో వచ్చినారా – కట్టికొట్టుచు నిన్ దిట్టినారా కండ్లగంతల్ కట్టి కొరడాలతోను గొట్టి కఠినులంతా ముండ్లమకుట మౌదుల మొత్తినారా ||సిలువ॥
3. కొయ్య నెత్తి – కల్వరిగిరి వరకు మొయ్యమనుచు నిన్ మరిమొత్తినారా మూర్ఖులందరు నీదు – మోముపై నుమియు చున్ – మోక్షనాధా యెరుషలేం పురవీధుల త్రిప్పినారా ||సిలువ॥
4. జీవజలముల్ – జీవమునిచ్చే దేవ దాహమాయెన – ధరయందు నీకు – చేదు కలిపినట్టి- ద్రాక్షారసమునిచ్చి – ద్రాగనునిరా దాహము తీరెన – నీకు తండ్రి ||సిలువ॥
5. పంచఖండంబు – ప్రజలన్ రక్షింప- పంచగాయంబులను పొంది తుదకు – అప్పగింతున్ తండ్రి- ఆత్మనిదిగో యనుచు – జెప్పి నాధా ఆత్మకై అర్పణనిచ్చినావా ||సిలువ॥
6. మరణమై నీవు మరిలేచినావా మరణపుముల్లన్ – మరివిరిచి నావా -మాకు విజయంబిచ్చి హల్లెలూయ మళ్ళివచ్చెదవా? మోక్షపురికి మరలనరిగినావా ॥సిలువ॥