← కీర్తనలు

695. సిలువ చెంత చేరివాడు...

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సిలువ చెంత చేరిననాడు - కలుషములను కడిగివేయున్ (2) పౌలువలెను సీలవలెను (2) సిద్ధపడిన భక్తులజూచి (2) ||సిలువ||
1.  కొండలాంటి బండలాంటి (2) మొండి హృదయంబు మండించు (2) పండియున్న పాపులనైన - పిలచుచుండే పరము చేర (2) ||సిలువ||
2.  వంద గొర్రెల మందలోనుండి (2) ఒకటి తప్పి ఒంటరియాయే (2) తొంబది తొమ్మిది గొర్రెల విడిచి - ఒంటరియైన గొర్రెను వెదకెన్ (2) ||సిలువ||
3.  తప్పిపోయిన కుమారుండు (2) తండ్రిని విడచి తరలిపోయే (2) తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రియతని జేర్చుకొనియే (2) ||సిలువ||
4.  పాపి రావా పాపము విడచి (2) పరిశుద్ధుల విందుల జేర (2) పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతము (2) ||సిలువ||