పల్లవి:
దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా, నీవు తరిమి తరిమి కీడుచేయ పరుగులెత్తినగాని తుదకు ||దొ||
1. చిన్న చూపు చూచి తమ్ముని కన్నెఱుంగక చంపినగాని అన్న కయీను దేవుని హస్తమునకు దొరికిన రీతిగా ||దొ||
2. వరములొందిన తమ్ముని జంప వలయునని పంతముగబట్టి నరకవచ్చిలోబడి యేడ్చిన దురిత చరితుని యేశావువలె ||దొ||
3. భక్త దావీదును బట్టి ప్రాణము దీయగ దలచిన తన శక్తితో తరిమిన రాజగు సౌలు దొరికినరీతిగాను ||దొ||
4. విగ్రహమునకు మ్రొక్కని దైవ పిల్లల నగ్నిలోపడవైచి ఆగ్రహించిన నెబుకద్నెజరు గడ్డిమోసి దొరికిన విధముగ ||దొ||
5. క్రైస్తవులను బట్టి కొట్టి ఖైదులో వేయదలచినను వాస్తవమగు వెలుగును జూచి ప్రభుని చాటిని పౌలుబోలి ||దొ||
6. కీడుచేయబోకు మెపుడు కీడు నీకే కీడు కీడు కీడు చేసినమేలుచేసి కీడును జయింపకపోతే ||దొ||
7. మాటలు కుదిరితే మాటలు కోటలు కుదురును నీకు మాటలలో లోటుంటే నోటిమాట తప్పకుండ ||దొ||
8. దొంగతనము వ్యభిచారమునకు లొంగి శాపగ్రస్తులునై దొంగిలించిన దశమభాగమే లొంగుట కారణమని తుదకు ||దొ||
9. కొంతయిచ్చిన దశభాగ మంత యిదియని తప్పుకున్న కొంతయిచ్చిన కయీనువలె కొంతయిచ్చిన అననియవలె ||దొ||
10. చెడుగుచేసి బదులు దానిని చేసినారని చెప్పమన్న వడిగ దేవుని న్యాయమనెడి పరమత్రాసులో నిలువండి ||దొ||
