← కీర్తనలు

659. నిత్యము దేవుని స్తుతించుడి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దే||
1.  ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆ ఆ ||దే||
2.  ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశవిశాలమందు ఆ ఆ ||దే||
3.  ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి ఆయనప్రభావమును ||దే||
4.  బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలముతో ఆ ఆ ||దే||
5.  సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో ||దే||
6.  తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతోను ఆ ఆ ||దే||
7.  పిల్లనగ్రోవులు చల్లగనూది ఎల్లప్రజలు జేరి ||దే||
8.  మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి గంభీర తాళముతో ఆ ఆ ||దే||
9.  సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమెన్ ఆ ఆ హల్లెలూయా ఆమెన్ ఎల్లప్పుడు ||దే||