← కీర్తనలు

632. సమయము లేదు!

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ నొందండి
1.  పాపులనందరిని తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా ||ఇక||
2.  రాజుల రాజైన యేసు రానై యుండేనుగా గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి తరుణముండగానే మీరు తయ్యారవ్వండి ||ఇక||
3.  బుద్ధి లేని కన్యకలవలె మొద్దులుగానుంటె సిద్దెలలో నూనెపోసి సిద్ధపడకపోతే తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి ||ఇక||
4.  వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండీ మిమ్మును ఎరుగను మీరెవరో పొమ్మనును ||ఇక||
5.  సందియ పడకండి మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ ||ఇక||
6.  జాలము చేయకను మెరు హేళన చేయకను కులము స్థలమనుచూ మీరు కాలము గడువకనూ తరుణముండగానే మీరు త్వరపడి రారండి ||ఇక||