← కీర్తనలు

631. రారాజుకు స్వాగతం!

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి సంతోషించు యెరుషలేం కుమారి ఉల్లసించు ||ఇదిగో||
1.  నీదురాజు నీతితో దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు వచ్చు చుండె ||ఇదిగో||
2.  రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె ||ఇదిగో||
3.  స్వాతికుండు యీభువిన్ అత్యంతమగు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండె ||ఇదిగో||
4.  దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె ||ఇదిగో||
5.  ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో బలుడగు నీ ప్రభు వచ్చుచుండె ||ఇదిగో||
6.  దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయగీతములతో వచ్చుచుండె ||ఇదిగో||
7.  యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ వచ్చుచుండె ||ఇదిగో||