627. క్రీస్తుయొద్దకు ఆహ్వానం

పల్లవి:అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య...
1. నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె...||అ||
2. మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి జయధ్వనులిడిరె ||అ||
3. ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా ||
4. లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని జాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని ||
5. పావనయేసుని పదముల చేరుము పాపములను తొలగించు నిదే జీవము నిచ్చును భావము మార్చును దేవ దేవుని కరుణ యిదే ||అ||
6. హల్లెలూయ పాటలు పాడుదము ఆనందముతో ప్రభు చాటుదము అలరాకడకై తలలెత్తుదము ఆ ప్రభురాగా వెళ్ళుదము ||అ||