పల్లవి:ప్రభువా మమ్మునుదీవించి పంపుము నీ కృపనందించి అభినందన ములఁ జేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్ ||ప్రభువా||
1. పగతురఁ బ్రేమించెడు శక్తిన్ తగఁబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ చేయుము దైవ జగదేక కుమారా కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా||
2. గుడిలో వినిన నీవాక్యము మా గుండెలఁ బదిలము జేయఁగను గుడిబయటను నా చారములో నడువగఁ దోడ్పడుమో కీర్తి యుగయుగము లకు నీ కగుతన్ ||ప్రభువా||
3. క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము జేయఁగనిమ్ము నేస్తవ భావము లోకములో నెరపఁగ దయఁగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా||
