← కీర్తనలు

604. ప్రభువు మీతో నుండుగాక

రాగం: తిల్కా మోద్|తాళం: ఆది|రచయిత: ఎ.చార్లెస్ కిన్సింగర్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దైవప్రేమ మనలనెపుడు బంధించుగా దివిని భువిని దీన జనులను దిరముగా కాపాడుగా||
1.  పరమతండ్రి గద్దెముందట ప్రార్థనల్ మరిజేతుము పలు విధముల మార్గములలో ప్రభువే తోడైయుండుగా ||దైవ||
2.  నిత్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము నిలిచియుందుము క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా ||దైవ||
3.  మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్గును వేదన మనసు హృదయము కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో ||దైవ||
4.  జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు ఆదినుండి యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా ||దైవ||