← కీర్తనలు

603. క్రొత్త సంవత్సరము

రాగం: కాంభోజి|తాళం: త్రిపుట|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు టుత్తమోత్తమంబుఁ జూడఁ ||క్రొత్త||
1.  పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ ||క్రొత్త||
2.  మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ ||క్రొత్త||
3.  బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల నెలమి మీ రొనర్చుచుండఁ ||క్రొత్త||
4.  ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ జూడ వలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ ||క్రొత్త||
5.  పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి మీరు వేఁ డ గా నేపుమీఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ ||క్రొత్త||