కీర్తనలు

560. దైవాశీర్వాదము

రచయిత: బేతాళ జాన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రభు మార్గములయందె భయభక్తి నిందు శుభరీతి నడిచే పురుషుండే ధన్యుండు ||ప్రభు||
1.  అనుపల్లవి: ుడు నీచే కష్టం బారగించుదువు ఎపుడు ధన్చుడవు నీ కిలమేలౌ గాక ||ప్రభు||
2.  నెలవు ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్షతీ గెల పోలి నీ భార్య ఫలమిచ్చును గాక ||ప్రభు||
3.  పిల్లలిప్ప మొక్క పెంపువలె నీదు బల్లజుట్టుకొని శో భిల్లుదురు గాక ||ప్రభు||
4.  ప్రభున కిదిగో భీతి పడువాడీరీతి విభవంపు దయనొంది వికసించునుగాక ||ప్రభు||
5.  ప్రభు సీయోనునుండి ప్రశస్త కృపను ప్రబలంబుగా నిచ్చి బ్రతికించునుగాక ||ప్రభు||
6.  అరయ బ్రతికెడు రోజు లన్నిట నీవు యెరుషలేము క్షేమంబు నెపుడు జూచెదవు ||ప్రభు||
7.  నీదు పిల్లల పిల్లలు నిజామిశ్రాయేలు మీది క్షేమముజూచి మోదమొందెదరు ||ప్రభు||
8.  తండ్రి కుమార శుద్ధాత్మునకు మహిమ మెండై యుగయుగములం దుండుగా కామేన్ ||ప్రభు||