← కీర్తనలు

541. మంచి సమరయ్యుడు

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: జి.జాన్ తాతయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు వతో వెడలుచుండె కొంత ధనముతో ||ఒక్క||
1.  మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు గొట్టి విడిచి వెళ్లిరి ||ఒక్క||
2.  అనుపల్లవి: ుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె వాని నాదరింపక ||ఒక్క||
3.  వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి పోయె గరుణలేకను ||ఒక్క||
4.  పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి గరుణతోడ భేదమొంచక ||ఒక్క||
5.  నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు వాహనముమీద నూరు చేర్చెను ||ఒక్క||
6.  అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను జూచి యాదరింపవలయును ||ఒక్క||