539. ఉదయ ప్రార్థన

పల్లవి:దేవ కావవే నేడు మమ్ములన్ నీవెరాత్రి కాచినావు నీకు స్తోత్రము ||దేవ||
1. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కఱుణ తోడను ||దేవ||
2. నేటి కార్యముల్ నేడె చేయగా సూటియైన త్రోవ మాకు చూపుమోప్రభో ||దేవ||
3. చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము దేవ ||దేవ||