← కీర్తనలు

465. లెమ్ము తేజరిల్లుము

రాగం: కళ్యాణి|తాళం: ఆది|రచయిత: తూలూరి ప్రకాశము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ ప్రభుని మహిమ ఇదిగో నుందయించె నీపై ||లెమ్ము||
1.  జనములు నీదు వెలుగునకు జనుదెంచెదరు గనుమ తనర నీ యుదయ కాంతికి తరలి రాజులు వత్తురు ||లెమ్ము||
2.  సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు వీవైపు అమరుగ జనుల యైశ్వ ర్యము వచ్చు నీ యొద్దకు ||లెమ్ము||
3.  గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచి తేబడు నాపాద క్షేత్రము గొప్పగజేతు ||లెమ్ము||
4.  నిత్యమౌ కాంతితోడ నిన్ను వెలుంగజేతు నిత్య సంతోషమునకు నిన్ను కారణముగ జేతు ||లెమ్ము||
5.  ఎంచంగ నొంటరిగాడె ఎసగు వేయిమందియై ఎంచంగ దగని నాడె ఎంతో బలమగు జనమగును ||లెమ్ము||