← కీర్తనలు

457. క్రీస్తు కొరకు సేవ

రాగం: ఖరహరప్రియ|తాళం: ఆది|రచయిత: బునమల్ల బెంజమిన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శ్రీ యేసుని వేఁడు మనసా సేవింపవే నేఁడు నీ యఘములను బాపియు నిను నెడ బాయక కడు సహాయము జేసెడి ||శ్రీ యేసు||
1.  పాపంబులు వీడి పశ్చా త్తాపబంబును గూడి దాపున జేరుము దయగల ప్రభువు నీ పాపముఁ బాపియుఁ పాలించును ధర ||శ్రీ యేసు||
2.  దేవుని మరువకుము దైవ సేవను మరువకుము జీవపుఁ త్రోవను స్థిరముగ నడువను పావన మనసును బ్రాపుగ నిచ్చెడి ||శ్రీ యేసు||
3.  రక్తము చిందించెఁ ప్రభువు రక్తితో నీ కొరకు రక్తపు టూటల శక్తిని నమ్మిన ముక్తి కలుగును భక్తితో నీవు ||శ్రీ యేసు||
4.  సిలువయే నీ ఘనము క్రీస్తు సిలువయే నీ ధనము సిలువయే భాగ్యము తులువల కెల్లను సిలువ వలననే కలుగును రక్షణ ||శ్రీ యేసు||