← కీర్తనలు

456. క్రైస్తవ సేవ

రాగం: సావేరి|తాళం: రూపకము|రచయిత: మొలతాటి విద్యానందము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సంతసంబున వత్తు సర్వేశ్వరుని చిత్త మెంతయు నెరవేర్చను వంతలు విడి నాదు నంతరంగము కదుర నెంతో విశ్వాసమున వెంట వత్తును బ్రభువా ||సంత||
1.  సురుచిరమగు మరియ సూనుని యాజ్ఞలు శిరమున నిడికొందును మరియ మనసుతో మర్తమ్మ కరములతోఁ బరమ సౌఖ్యముఁ బొంద భక్తితో సేవింతు ||సంత||
2.  నారాజు సేవ దు ర్భరమై బాధగ నున్న భారంబుగను దోఁచదు సారెసారెకుఁ దనదు చక్కని చిఱునవ్వు వారించి భారమున్ ధీరత నొస గును ||సంత||
3.  కారుణ్యమున నాదు కల్మషమయ హృదయ భారములను మోసితి ఆ రాజ్యమునఁగల యాస్తికై నా చిత్త మాలసింపఁగ నెత్తి యందే స్థిరముగ నుంచు ||సంత||
4.  ఈ యుర్వి నేఁజేయు సేవకు ఫలములు నీ చోటఁ గనుఁగొందునే కాయం బీధర కర్మలం గరపిన నా యాస్తి నా హృదయ మాలో కమున మండు ||సంత||