← కీర్తనలు

438. పవిత్ర హృదయము కొరకు ప్రార్థన

రాగం: శంకరాభరణము|తాళం: త్రిపుట|రచయిత: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
విమల హృదయ మిమ్ము విదితంబు నినుఁ గొల్వ యేసునాధా నీదు విమల రక్తము చేత విశదమౌ యెద నిమ్ము విశ్వనాధా ||విమల||
1.  అణఁకువ క్షమశాంత మధికముగ నాకిమ్ము ఆత్మనాధా నీకుఁ బ్రణుతమౌ నా యెద ప్రభునిపీఠము జేయు మాత్మనాధా ||విమల||
2.  నీ చిత్తమే యంచు నీ పాదములఁ బట్టి నిల్చియుందు నిండు నికరమౌ ప్రకటమౌ సుకరహృదయ మిమ్ము మేసునాధా ||విమల||
3.  భయభక్తు లలరెడు భావంబు నా కిమ్ము జీవనాధా నన్ను లయ జీవములయందు జయశాలినిగఁ జేయు మేసునాధా ||విమల||
4.  పరిశుద్ధ హృదయంబు పరమేశ నా కిమ్ము ధరణిమీఁద నన్ని తరుణములను నాకా దరణ మీవే యంచుఁ దలఁప నాధా ||విమల||
5.  నీ రూపము నిమ్ము నినుఁ బోలి నేనుండ నిత్యనాధా నీదు సారూప్య మెదమీద సంపూర్తిగా వ్రాయు సత్యనాధా ||విమల||
6.  ప్రేమపూరిత హృదయ మేమరక నా కిమ్ము ప్రేమనాధా యెంతో ప్రేమమౌ సుమమౌ నేమమౌ బ్రతుకిమ్ము క్షేమనాధా ||విమల||