కీర్తనలు

437. పరిశుద్ధత కొరకు ప్రార్థించుట

రాగం: రేగుప్తి|తాళం: అట|రచయిత: యేసుదాసు జీవరత్నము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రమ్ము శ్రీ యేసూ సమ్మతి నాదు మనమున నిలువ నిమ్ము నా పెదవుల నీతి అగ్నిచే నంటఁ గ్రమ్మర నా నత్తి వదలి నీ కృపఁ బొంద ||రమ్ము||
1.  నిన్ను స్తుతింతు నీ కృప నెపుడు నెన్ని కీర్తింతుఁ బన్ను గ నీ కృప ని న్నెన్నఁ డెరుఁగని నరుల కన్న యేసున్నా నీ ధన్య రుధిరమె చాలు ||రమ్ము||
2.  తరమె యెన్నఁగను దత్కృపను భూ నభముల నైనన్ నిరతము నీ ప్రేమ నీతి పరిమితిచే ధరఁ దేజో వాసులకుఁ గలిగించుఁ గడు వింత ||రమ్ము||
3.  భవదీయ కృపను బాగుగఁ జాటి భువి నీ చిత్తమును అవిధి నెం చక తీర్చి యమిత బలముతోడ నవగతి నీతి కి రీటంబు నేఁ బొంద ||రమ్ము||
4.  నేను నీ కొరకే నిత్యము బ్రతికి నిన్ను గణుతించి మానుగ 'భళా' యను మంచి వాక్యము విని దీన ప్రభుని సమా ధానములో నేఁ జేర ||రమ్ము||