← కీర్తనలు

434. క్రీస్తు దాసుల సహవాసము

రాగం: బేహాగ్|తాళం: రూపకము|రచయిత: డేవిడ్ లైటన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు భక్తవరులతో ని వాసముందమ యేసుదాసు లౌదమ ||యేసు||
1.  దోసములను తీగలన్ని కోసివేతమ మిగుల మోసపుచ్చు నాసలెల్ల రోసివేతమ యేసుదాసు లౌదమ ||యేసు భక్త||
2.  దోసిలొగ్గి ప్రభునివేడ గాసి పడుదమ వాసిగాను యేసుమీద నాసపడుదమ యేసు దాసు లౌదమ ||యేసు భక్త||
3.  జారచోర దుష్కృతములు పారవేతమ సత్య సార మెరుగ బరమ గురుని జేరు కొందమ యి(క కోరు కొందమ ||యేసు భక్త||
4.  ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును యేసు శాపరాసులన్ని తానే యోపి మోసెను తండ్రి దాపొసంగును ||యేసు భక్త||
5.  శరణుజొ చ్చు నందరకును దురిత మెంచక ఘోర మరణ బాధలెల్ల దీర్చి పరమొసంగును స్ధిర వరము లిచ్చును ||యేసు భక్త||
6.  లోక భోగముల మదిన్ని రాకరింతమ ప్రభు రాక కెదురు జూడ మన మేక మౌదమ ఇపుడె యేక మౌదమ ||యేసు భక్త||