← కీర్తనలు

433. క్రైస్తవానుభవము

రాగం: శంకరాభరణము|తాళం: అట|రచయిత: పురుషోత్తము చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు నామం బెత్తి పాడుదమ క్రీస్తు దాసులతో ఁ బొత్తుఁ గూడు దమ ||యేసు||
1.  ఇహసంబంధుల పొందుఁ జాలింతమ మహా మహుఁడౌ దేవుని యాజ్ఞఁ బాలింతమ ||యేసు||
2.  శుభవార్తర్థము లన్ని శోధింతమ యేసువిభు సత్యమిలలోన నుభవింతమ ||యేసు||
3.  దోషములను బైటఁ బెట్టుదము కపట వేషభాషలఁ గ్రుంగఁ బట్టు దమ ||యేసు||
4.  మన రక్షకుని పాట్లు మది నెంతమ మనసు లోపలి గర్వము లణుపుదమ ||యేసు||
5.  జనుల నిందల కెల్ల నోర్చెదమ బోధ కనిపెట్టి ప్రభు చెంత నేర్చ దమ ||యేసు||
6.  మానావమానముల్ భరియింతమ యోర్వ లేని గుణముల వేరుఁ బెరుకుదమ ||యేసు||
7.  పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ బుద్ది పరమానందము జాడ నడుపు దమ ||యేసు||
8.  సకల మానవు లాత్మ సరిచూతమ యింక మొక మిచ్చకపు మాట ల్విడిచెదమ ||యేసు||
9.  దినము ప్రార్థనఁ జేయ గురి యుంతమ చెడ్డ మనసు బద్ధకముపై నెదిరింతమ ||యేసు||
10.  గురు బోధ స్థలికి బిరబిరఁ బోదమ బుద్ధి తిర ముంచి వాక్యార్థ మెఱు గుదమ ||యేసు||