427. I need Thee every hour

రచయిత: ఏనీ షెర్పుడ్ హాక్స్
పల్లవి:యేసూ, నా ప్రభువా, నీ ప్రేమ లేకున్న నా యాత్మ కేదియు విశ్రాంతి నియ్యదు. ||ఒక్కొక్క గంట నేను నిన్నాశించుకొందు నీ యాశీర్వాద మిమ్ము నా రక్షకుఁడా||
1. యేసూ, రేబగుళ్లు నా యొద్ద నుండుము నాతో నీవుండిన నే భయ ముండదు.
2. సుఖంబుఁ బొందఁగా నిన్నే యాశింతును దుఃఖంబు నొదఁగా నీవే శరణ్యము.
3. నీ మార్గమందున నే నడ్వ నేర్పుము నీ మాట చొప్పున నన్నున్ దీవించుము.
4. నిన్నే యాశింతును యేసూ, నా ప్రభువా నీవంటివాఁడనై నన్నుండఁ జేయుము.