← కీర్తనలు

426. Down in the valley

రచయిత: విలియం ఆర్కట్ కషింగ్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను సురక్షితంబుగాను నేను వెళ్లుదున్ బరమ కిరీట మొందువరకు. ||యేసున్ నేను ఎన్నఁ డెన్నడును ఆసతో నన్నిటన్ వెంబడింతును భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని యొక్కఁడేని వెళ్లుదున్||
1.  నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలై భయ పడన్ దయఁ జూపు యేసు నన్ను వెం డించుచో భయ మేల భువనంబులోదగన్
2.  నా కాలమెల్ల యేసుసందునమ్ము దున్ భీకరింపు వాధియైన నేదాటుదున్ నా కర్తతోడ నెందునైన నేగుదున్ నాక మెక్కితండ్రిఁ చువరకున్.