పల్లవి:
జీవమా చింతించకుండు నిన్నుఁ గావ వచ్చిన యేసు కరుణా మయుండు జీవమా చింతించి క్షితి మూరె డైన నీ జీవము కున్నతిఁ జేసెదవా కావున నీ చింతా క్రాంతము వెడలించు దేవుఁ డెహోవ నీ దిక్కని నమ్మి ||జీవమా||
1. గగన వీధిని బోవు ఖగములు దున్నునా తెగఁగోసి కొట్లలో దాఁ చునొకో యగణిత పక్షుల కాహార మియ్యంగ బెగడెద వెందుకు పెంచు ని న్నత డు ||జీవమా||
2. పక్షి వృక్షాదుల పై నింత ప్రేమతో భక్షణ లిచ్చుచుఁ బాలింపఁగా నక్షరములకంటె హెచ్చుగ నన్నెంచి యక్షయముగ నేలు నల్పవిశ్వాసి ||జీవమా||
3. మిశ్రాయీం బాధల మేరల దొలఁగించి యిశ్రాయేలుకు మన్నా నియ్యలేదా యాశ్రయమై నీదు హస్తము విడువక నీ శ్రమలను బాపి నిన్నేలునతడు ||జీవమా||
