← కీర్తనలు

397. దేవుఁడు తన పరిశుద్ధులను ఎన్నడు నెడబాయఁడు

రాగం: శంకరాభరణము|తాళం: త్రిపుట|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎన్నడు నెడఁబాయ నే కొల(ది విడనాఁడ ననిన తండ్రి నిరత మన్ని బాధలయందు నన్ని దుఃఖములందు నన్ను ఁ బ్రోచు ||ఎన్నడు||
1.  పాపుల రక్షింపఁ బ్రాణమిచ్చిన యేసు బ్రతికి యుండు తన ప్రాపు గోరినవారి భారము తా మోసి ప్రాపయి యుండు ||ఎన్నడు||
2.  ఎల్ల కాలంబుల నేకరీతిగ నుండు యేసునాధుఁ డాతఁ డెల్ల విశ్వాసుల నెల్ల వేళలఁ దలఁచి యేలుచుండు ||ఎన్నడు||
3.  తనవారి యక్కఱలు తానెఱిగి యున్నాఁడు తప్పకుండ నాతఁ డెనలేని దయఁబూని వినువారి మనవులు వేడ్కమీఱ ||ఎన్నడు||