కీర్తనలు

388. విశ్వాస ప్రార్థన

రాగం: సౌరాష్ట్ర|తాళం: ఆది|రచయిత: ఎ.జకర్యా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
విశ్వాసముతో వేఁడెడి వారికి విశ్వ మంతయును వీల్పడును శాశ్వత రాజ్య థీశ్వరుఁ డాఢ్యుఁడు శాశ్వత మగు నీ శాసన మె చ్చెను ||విశ్వా||
1.  బిడ్డలు తండ్రుల వేడఁగ నన్నము బెడ్డ లిచ్చు వె ఱ్ఱులు గలరే దొడ్డ తండ్రి నిలఁ దోడ్పా టడిగిన నడ్డులేక విమ లాత్మ నొసంగును ||విశ్వా||
2.  నమ్మకమునఁ జెడు నరులను గానము నమ్మక చెడుదురు నరులయ్యో ఇమ్మహి సకల శు భమ్ములు గలుగును సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము ||విశ్వా||
3.  వెతకెడు వారికి వెసఁ గృపఁ జూపును గతిఁ గని వేడం గాఁ దెర చున్ సతతము యేసుని చక్కని పేరట హిత మతి వేఁడగ నెంత యు మేలగు ||విశ్వా||
4.  బల మేమియుఁ గనఁ బడ దాహ నే సలిపెడు భక్తిని సతి మను చు నలయకు నేలను నావగింజ మరి నిలిపినఁ జెట్టయి నింగికి నెదుగదె ||విశ్వా||
5.  అవిశ్వాసమున నతి భీతులచే నవిసి క్రుంగ నగు నే మనసా భువిఁ బాపాత్ములఁ బ్రోచెడు ప్రభు కృపఁ జవిఁ జూడుము నుతి సల్పుచు వేగమే ||విశ్వా||