కీర్తనలు

376. దైవసహాయము కొరకు ప్రార్థన

రాగం: నాధనామక్రియ|తాళం: అట|రచయిత: మిక్కిలి దేవసహాయము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవా సహాయము నిమ్మా జీవంపు టూటలు ద్రావుట కిమ్మా ||దేవా||
1.  గడియ గడియకు నెగసెఁ నమ్ము లెంతో వడిగా నాపై వచ్చె నరక బాణములు ఎగతెగని శోధనములు నీవు పడఁగొట్టి వేగమె దృఢభక్తి నిమ్మా ||దేవా||
2.  కోటాన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చె మరి నికృష్టములు సాతాను సాధనములు నేను దాఁటి నీ రెక్కల చాటున నుండ ||దేవా||
3.  దారా పుత్రుల పైన భ్రమలు నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు ఘోరమగు నాత్మకములు న న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన ||దేవా||
4.  మా యావువుదినములు చెట్టు చాయవలెఁ దరుగుచు మంటి పాలౌను చాలు నీ లోకంబు మేలు మేము పరలోకరాజ్యము చేరుట మేలు ||దేవా||
5.  మంచి మరణం బిమ్ము దేవ మమ్ము వచించు సాతాను వల నుండి కావ నెంచి దూతల నంపినావ మాకై పంచగాయములొంద ప్రభు వచ్చినావా ||దేవా||