పల్లవి:
నా దేవ ప్రభువా నీ చెంతను సదా వసింపను నా కిష్టము ఏవైన శ్రమలు తటస్థమైనను నీ చెంత నుందును నా ప్రభువా
1. ప్రయాణకుండను నడవిలో నా త్రోవఁ జీఁకటి కమ్మినను నిద్రించుచుండఁగా స్వప్నంబునందున నీ చెంతనుందును నా ప్రభువా.
2. యాకోబు రీతిగా ఆ మెట్లను స్వర్గంబుఁ జేరనుఁ జూడనిమ్ము. నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చఁగా నీ చెంతనుందును నా ప్రభువా.
3. నేనిద్రలేవఁగా నా తండ్రి, నే నీకుం గృతజ్ఞతఁ జెల్లింతును. నే చావునొందఁగా ఇదే నా కోరిక నీ చెంతనుందును నా ప్రభువా.
