కీర్తనలు

359. క్రైస్తవ వీరులు

రాగం: శంకరాభరణము|తాళం: ఏక|రచయిత: ఎ. జెఖర్యా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా వైరిఁ జంప యుద్ధమాడు శూరుల మయ్యా ||వీరుల||
1.  మాంస లోక పిశాచి హింసపరచిన మము ధ్వంసముఁజేయ పై బడిన ధ్వజము విడమాయా ||వీరుల||
2.  పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగఁ బ్రజకుఁ బయలుపర్చు భటుల మే మయా ||వీరుల||
3.  అతి దుష్ట ద్రోహులు మము వెతలఁ బెట్టిన నీ క్షితి సువార్త కొఱ కొకింత సిగ్గు పడ మయా ||వీరుల||
4.  భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకుఁ బ్రాణ మైనఁ బెట్టువారము ||వీరుల||