కీర్తనలు

358. క్రైస్తవమను యుద్ధము

రాగం: సురటి|తాళం: త్రిపుట|రచయిత: జి.మునిస్వామి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సిలువ సైనికులారా నిలువండి వడి లేచి బలుఁడు యేసుక్రీస్తు ప్రభు దయ జయ మౌను ||సిలువ||
1.  రారాజు పంపున రణము సేయగఁ బూని ధీరులై నిలువుఁడి దినము శత్రుల గెల్వ ||సిలువ||
2.  అతఁడు నిజ ధ్వజ మత్యున్నతి నొంద బ్రతి వీరుని గెల్చు వరకుసేనల నడుపు ||సిలువ||
3.  మీ స్వీయ బలమున మీ రానుకొనకయే మీ స్వామి బలమును మీరు నమ్మి గెలువ ||సిలువ||
4.  శత సహస్రము లైన శత్రుల నెదిరించి సతతము ప్రభు సేవ సల్పి ధైర్యము నొంది ||సిలువ||
5.  దేవుఁ డొసఁగినట్టి దివ్య కవచముఁ దాల్చి భావ ప్రార్థనాసి బట్టి యుద్ధము సేయ ||సిలువ||
6.  జయశీలు రగు వారు చారు కిరీట మంది జయశాలి క్రీస్తు దయ జనెదరు సద్గతికి ||సిలువ||