← కీర్తనలు

334. Just as I am, without one plea

రచయిత: చార్లెట్ ఇలియట్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఉన్నట్టు నేను వచ్చెదన్ పాపిష్ఠు న్నీవు పిల్వఁగన్ నీ నెత్రుచేతఁ గడ్గుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!
1.  ఉన్నట్టు నేను వచ్చెదన్ నే నొప్పుకొందుఁ దప్పులన్ నీ మాటతో హరించుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!
2.  ఉన్నట్టు నేను వచ్చెదన్ దుఃఖంబు బాధపర్చఁగన్ బాపంబుఁ జేయనీకుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!
3.  ఉన్నట్టు నేను వచ్చెదన్ యేసూ, కబోది నుండగన్ ఆత్మీయదృష్టి నీయుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!
4.  ఉన్నట్టు నేను వచ్చెదన్ నీ మాట నమ్మునట్టి నన్ మన్నించి చేర్చుకొమ్మయా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!
5.  ఉన్నట్టు నేను వచ్చెదన్ నీ ప్రేమ నన్నుఁ బిల్వగన్ నీ వాఁడ నౌదు సర్వదా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!